భార్య మృతదేహాన్ని కారులో వదిలేసి పారిపోయిన భర్త..
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:29 AM
ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో కారులోనే మృతి చెందారు. భార్య మృతదేహాన్ని కారులోనే వదిలిపెట్టి భర్త పారిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలోని ఖానాపురంలో జరిగింది. భర్తే హత్య చేసి పరారయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఖమ్మం, సెప్టెంబర్ 10: జిల్లాలోని ఖానాపురంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో కారులోనే మృతి చెందారు. భార్య మృతదేహాన్ని కారులోనే వదిలిపెట్టి భర్త పారిపోయాడు. భర్తే అనుమానంతో హత్య చేసి పరారయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యాసాగర్, రేణుక దంపతులు జిల్లాలోని ఖానాపురంలో నివసిస్తుంటారు. రేణుకపై భర్త విద్యాసాగర్‌కు అనుమానం ఉండేది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో కారులో వెళ్తున్న సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో రేణుక కారులోనే మృతి చెందారు. దీంతో విద్యాసాగర్ కారును దారి మధ్యనే వదిలేసి పారిపోయాడు. భర్తే హత్య చేసి పారిపోయాడని రేణుక బంధువులు ఆరోపిస్తున్నారు. పరారీలో ఉన్న విద్యాసాగర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రేణుక మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదని వారు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు
For More TG News And Telugu News