నెలలో 50వేల మెట్రిక్ టన్నుల.. ఆయిల్‌పామ్ గెలల క్రషింగ్
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:03 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని అప్పారావుపేట ఆయిల్‌పామ్ కర్మాగారం అరుదైన రికార్డును సాధించింది.
భద్రాద్రి జిల్లా అప్పారావుపేట కర్మాగారం రికార్డు
ఫలించిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల కృషి
అశ్వారావుపేట, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని అప్పారావుపేట ఆయిల్‌పామ్ కర్మాగారం అరుదైన రికార్డును సాధించింది. ఒక్క సెప్టెంబరు నెలలోనే గంటకు 90టన్నుల పూర్తిస్థాయి సామర్థ్యంతో.. 50,100 మెట్రిక్ టన్నుల గెలలను గానుగ ఆడించి ఆయిల్‌ఫెడ్ చరిత్రలో అత్యధిక ఉత్పత్తిని సాధించింది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పూర్తిస్థాయిలో 24 గంటలు నిరంతరాయంగా క్రషింగ్ చేయడం ద్వారా నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించారు. ఇప్పటికే అప్పారావుపేట ఆయిల్‌పామ్ కర్మాగారం 20.01శాతం అత్యధిక ఓఈఆర్‌ను సాధించింది.
గెలల క్రషింగ్‌లో తెచ్చిన అధునాత విధానాల ద్వారానే ఇది సాధ్యమయింది. ఆగస్టులో టన్ను గెలల ధర రూ.24.025 పలికింది. అంతేకాదు 2022-23లో ఆయిల్‌ఫెడ్‌లో వేసిన 40వేల ఎకరాల తోటల నుంచి గెలల దిగుబడులు ఈ ఏడాదే ప్రారంభం కావడం విశేషం. ఈ సందర్భంగా టీఎస్ ఆయిల్‌ఫెడ్ ప్లాంట్స్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు, సూచనలు, ప్రభుత్వ అధికారులు, ఆయిల్‌ఫెడ్ అధికారులతో నిరంతరం సమీక్షలు, చర్యలుతో ఆయిల్‌ఫెడ్ అధికారులు, సిబ్బంది సహకారంలో ఈ అరుదైన రికార్డులు సాధించగలిగామన్నారు.
పంటలన్నీ మద్దతు ధరకే కేంద్రం కొనుగోలు చెయ్యాలి
హైదరాబాద్: మద్దతు ధర ప్రకటించడంతోనే కేంద్రం బాధ్యత అయిపోదని.. ఆ ధర ప్రతి రైతుకు అందేలా చూడటం కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యతే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కేంద్ర కేబినెట్ రబీ మార్కెటింగ్ సీజన్ 2027-28కు సంబంధించి కనీస మద్దతు ధరలను పెంచిందని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పీఎ్‌సఎ్‌సలో.. ఆయా రాష్ట్రాల్లో సాగవుతున్న పప్పుధాన్యాలు, నూనెగింజల మొత్తం ఉత్పత్తిలో నాఫెడ్ ద్వారా కేవలం 25 శాతం మాత్రమే సేకరిస్తుందని... అలాకాకుండా ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు, వాతావరణ మార్పుల నేపథ్యంలో మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ కేంద్రప్రభుత్వమే 100 శాతం కొనుగోలు చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి...
సన్నధాన్యం @ రూ.3,400
ఒక దగ్గర కూర్చుని.. ఓటర్లే రావాలంటే కుదరదు!
Read Latest Telangana News And Telugu News