Share News

మేయర్ పీఠం కాంగ్రెస్‌దే: పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Feb 15 , 2026 | 11:57 AM

కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్‌దేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీగా తమకు ఆ హక్కు ఉందన్నారు.

మేయర్ పీఠం కాంగ్రెస్‌దే: పొన్నం ప్రభాకర్
TG Minister Ponnam Prabhakar

కరీంనగర్, ఫిబ్రవరి 15: కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్‌ పార్టీదేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీగా తమకు ఆ హక్కు ఉందన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. మేయర్ పీఠం కోసం కుట్రలు చేయాల్సిన అవసరం తమకు లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. గతంలో 13 స్థానాలు ఉన్నప్పుడే తాము మేయర్ పీఠం సాధించామని గుర్తుచేశారు. బీజేపీకి కావాల్సినంత సంఖ్యా బలం లేదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను తాము పట్టించుకోమని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం.. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులకు బాధ్యతలు అప్పగించారన్నారు.


అయినా.. బండి సంజయ్ గెలిస్తే ఒకటి.. తాము గెలిస్తే మరొకటా? అంటూ మంత్రి పొన్నం ప్రశ్నించారు. నిజామాబాద్‌లో మేయర్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారన్నారు. పూర్తి మెజార్టీ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారన్నారు. అయితే మెజార్టీ లేకపోయినా.. కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎలా చెబుతారని సందేహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్లలో ప్రజాస్వామ్య బద్ధంగానే మేయర్‌ను ఎన్నుకుంటారంటూ ఈ సందర్భంగా ప్రభాకర్ గుర్తు చేశారు.


మరోవైపు.. కరీంనగర్ మేయర్ పీఠంపై అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ చేపట్టింది. అందుకోసం ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మేయర్ సీటు బాధ్యతను.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లకు అప్పగించారు సీఎం. దీంతో వారు కరీంనగర్ చేరుకున్నారు. ఈ నగర కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


కరీంనగర్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, స్వతంత్ర అభ్యర్థులు 10 స్థానాల్లో గెలుపొందిన విషయం విదితమే. ఇక ముగ్గురు ఇండిపెండెంట్లు, అలిండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి చేరికతో బీజేపీ బలం 34కు చేరింది. కార్పొరేషన్లలో మొత్తం 66 స్థానాల్లో.. ఎక్స్‌అఫీషియో ఓట్లు ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణలతో ఓట్ల 69కి చేరాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ 36 కాగా.. బీజేపీ ప్రస్తుత బలం 35. అయితే సంఖ్యా బలం తమకే ఉందని కాంగ్రెస్ వివరిస్తోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ కేంద్రంగా క్యాంప్ రాజకీయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్టు అధికారుల అలర్ట్

శివరాత్రి వేళ.. ఇలా చేయండి..

For TG News And Telugu News

Updated Date - Feb 15 , 2026 | 12:48 PM