Share News

సింగరేణిని అవినీతి గనిగా మార్చారు

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:45 AM

సిరుల సింగరేణిని అవినీతి గనిగా మార్చారని, సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి రూ.10వేల కోట్ల మేర కుంభకోణాలకు పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

సింగరేణిని అవినీతి గనిగా మార్చారు
KTR

  • మూడేళ్లలో రూ.10వేల కోట్ల కుంభకోణాలు

  • ముఖ్యమంత్రి బావమరిదే సూత్రధారి: కేటీఆర్‌

గోదావరిఖని, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): సిరుల సింగరేణిని అవినీతి గనిగా మార్చారని, సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి రూ.10వేల కోట్ల మేర కుంభకోణాలకు పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సింగరేణికి సీఎండీ, డైరెక్టర్లు నామమాత్రంగానే ఉన్నారని, సీఎం బావమరిది సృజన్‌రెడ్డే సింగరేణిని నడిపిస్తున్నాడని ఆరోపించారు. ట్రాన్స్‌కోలో 26శాతం ప్రైవేట్‌పరం చేసేందుకు తెగించిన రేవంత్‌ సర్కార్‌.. రేపు సింగరేణిని కూడా అదానీ, అంబానీకి అమ్మేందుకు తెగబడుతుందని వ్యాఖ్యానించారు. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో బుధవారం నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభలో కేటీఆర్‌ మాట్లాడారు.


2023వరకు 70మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిచేసిన సింగరేణి.. కాంగ్రెస్‌ వచ్చాక 58మిలియన్‌ టన్నుల ఉత్పత్తికి ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. సింగరేణిలో అవినీతిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించడం లేదని, సీబీఐ, ఈడీలను దించడం లేదని ధ్వజమెత్తారు. వేల కోట్ల బాండ్లతో ఉన్న సింగరేణి సంస్థ.. ఇప్పుడు ఓడీలపై కాలం వెళ్లదీస్తోందన్నారు. రూ.60వేల కోట్ల బకాయిలను ఇవ్వకుండా సింగరేణిని చంపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఎంతటి పోరాటాలకైనా వెనుకాడదని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

2 లక్షల మందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ

గ్లోబల్‌ రైజింగ్‌ సమ్మిట్‌కు తరలిరండి

డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 05:50 AM