Share News

పీఎంజే జ్యవెలరీ కేసులో దొంగలు అరెస్ట్.. నేడు మీడియా ముందుకు..

ABN , Publish Date - May 14 , 2026 | 07:33 AM

కరీంనగర్‌లో పీఎంజే జ్యవెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దోపిడీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పీఎంజే జ్యవెలరీ కేసులో దొంగలు అరెస్ట్.. నేడు మీడియా ముందుకు..
Karimnagar In PMJ Jewellers Show Room

కరీంనగర్, మే14: నగరంలోని పీఎంజే జ్యవెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దోపిడీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 11.00 గంటలకు ఈ దోపిడీ ముఠా వివరాలను మీడియాకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వివరించనున్నారు.


మే 3వ తేదీన కరీంనగర్‌లోని పీఎంజీ జ్యువెలరీ షాపులో భారీగా బంగారంతోపాటు నగదు చోరీ జరిగింది. బైక్‌లపై సాధారణ కస్టమర్లలాగా వచ్చిన ఐదుగురు దొంగలు.. షాపులో క్షణాల్లో బీభత్సం సృష్టించారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించడంతో పాటు.. వారిపై కాల్పులు జరిపారు. అనంతరం బంగారం, నగదు చోరీ చేసి.. బైకులపై అక్కడి నుంచి వారు పరారయ్యారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దోపిడీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


జ్యువెలరీ షాపు పరిసర ప్రాంతంతోపాటు నగరంలోని వివిధ ప్రధాన మార్గాల్లోని సీసీ టీవీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు జల్లెడ పట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దోపిడీకి పాల్పడిన దొంగలను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని తమదైన శైలిలో విచారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దోపిడీకి పాల్పడిన దొంగలను పట్టించిన వారికి నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

బస్సును డీ కొట్టిన లారీ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

విచారణకు రాని భగీరథ్‌

For More TG News And Telugu News

Updated Date - May 14 , 2026 | 07:48 AM