Share News

నేడు సిరిసిల్లకు సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:31 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సిరిసిల్లకు వస్తున్న రేవంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమవుతుండగా, అధికార యంత్రాంగం సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

నేడు సిరిసిల్లకు సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy

  • భారీ ర్యాలీ, బహిరంగ సభకు ఏర్పాట్లు

  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

హైదరాబాద్‌/సిరిసిల్ల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సిరిసిల్లకు వస్తున్న రేవంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమవుతుండగా, అధికార యంత్రాంగం సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్‌లో కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా సిరిసిల్ల చేరుకుని, అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి సభా ప్రాంగణం వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు.


రగుడు కలెక్టరేట్‌ చౌరస్తా సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణంలోనే రూ.345.78 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. సభ కోసం సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్‌, జగిత్యాల, సిద్దిపేట నియోజకవర్గాల నుంచి సుమారుగా లక్ష మందిని సమీకరించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 7.45 గంటల వరకు బహిరంగ సభ కొనసాగుతుంది. కాగా, మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్ల్లూరి లక్ష్మణ్‌, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, విజయరామణారావు, ప్రభుత్వ సలహాదారుడు హనుమంతరావు తదితరులు సభ ఏర్పాట్లను పరిశీలించారు.


ఇవి కూడా చదవండి...
కాంగ్రెస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సామ రామ్మోహన్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి

ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 04:31 AM