కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సామ రామ్మోహన్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:20 AM
రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి సామ రామ్మోహన్‌రెడ్డిని, వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సామ రామ్మోహన్‌రెడ్డి సుదీర్ఘ కాలంగా టీపీసీసీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. సర్వోత్తమ్‌రెడ్డి దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తనయుడు.
ఇవి కూడా చదవండి...
ఎంకే 18 మాడ్ 2 కింగ్‌ఫిష్‌ను సీజ్ చేశాం: ఐఆర్జీసీ
Read Latest Telangana News And Telugu News