Share News

ఎమ్మెల్యేల మీద రేవంత్‌కు నమ్మకం లేదు: జీవన్ రెడ్డి

ABN , Publish Date - Apr 21 , 2026 | 02:03 PM

జగిత్యాలలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి శనిలా మారారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

ఎమ్మెల్యేల మీద రేవంత్‌కు నమ్మకం లేదు: జీవన్ రెడ్డి
Jeevan Reddy comments

జగిత్యాల: బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి శనిలా మారారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఇంకా రెండేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారో లేదో అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణమైనా మార్పులు జరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.


అంతేకాకుండా రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖత్ అయ్యారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆయనకు నమ్మకం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. సొంత కుంపటి పెట్టుకోవాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నారని ఆయన ఆరోపించారు. తన రాజకీయ ప్రయాణంపై స్పందిస్తూ, తన సమర్థత వల్లే తాను అన్ని సార్లు అవకాశాలు పొందానని జీవన్ రెడ్డి అన్నారు. తాను ఎవరినీ తొక్కుకుంటూ రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సమ్మె విరమించండి.. ఆర్టీసీ కార్మికులకు పొన్నం సూచన

బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఆ సభలు: రాంచందర్ రావు

For More TG News

Updated Date - Apr 21 , 2026 | 04:25 PM