Share News

బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఆ సభలు: రాంచందర్ రావు

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:01 PM

తెలంగాణకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. గత పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.12 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు.

బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఆ సభలు: రాంచందర్ రావు
T BJP Chief Ramachandrarao

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.12 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. అలాగే గత రెండేళ్లలో రూ. లక్ష యాభై వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని ఆయన వివరించారు. దీనిపై తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు.

అందుకు మీరు సిద్ధమా అంటూ.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సవాల్ విసిరారు. ఈ అంశంపై మీరు ఇద్దరు ఎక్కడికి వచ్చినా తాను చర్చకు సిద్ధమన్నారు. ఈ సవాల్‌ను స్వీకరించి చెబితే తాను సైతం చర్చకు సిద్ధమని కుండబద్ధలు కొడతానన్నారు.


దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తమ వద్ద రాయబారాలు నడపడం లేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి.. ఆ పార్టీ నేతల వద్ద మోకరిల్లుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం సీబీఐకి ఇవ్వమంటే.. నాణ్యత లేని బ్యారేజీలను మాత్రమే సీబీఐకి అప్పగించారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా ఎండగట్టారు.


దీనిని కాళేశ్వరం మొత్తం మీద సీబీఐ విచారణ అంటే ఎలా? అంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు కాదు.. గత పదేళ్లలో టీఆర్ఎస్, రెండేళ్లలో కాంగ్రెస్ అక్రమ మీటర్లు వేసి రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లు సమావేశాలు పెట్టినట్లుగా ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో భారీగా డిఫెన్స్ మద్యం పట్టివేత

ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడి

For More TG News And Telugu News

Updated Date - Apr 21 , 2026 | 12:08 PM