లోక్‌సభతో పాటు రాజ్యసభ సీట్లనూ పెంచాలి
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:22 AM
లోక్‌సభ సీట్లను పెంచడంతో పాటు రాజ్యసభ సీట్లనూ దామాషా ప్రకారం పెంచాలని, లేనిపక్షంలో రాజ్యసభ ప్రాధాన్యం తగ్గిపోతుందని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్ అన్నారు.
50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టం లేదు: వినోద్‌కుమార్
కరీంనగర్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లోక్‌సభ సీట్లను పెంచడంతో పాటు రాజ్యసభ సీట్లనూ దామాషా ప్రకారం పెంచాలని, లేనిపక్షంలో రాజ్యసభ ప్రాధాన్యం తగ్గిపోతుందని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్ అన్నారు. ప్రస్తుత పార్లమెంటు సీట్లను 50 శాతం మేరకు పెంచడం వల్ల దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు దామాషా పద్ధతిలో తేడా ఏమీ రాదని, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితేనే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పారు.
ఆదివారం ఆయన కరీంనగర్‌లో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. 2006లోనే కేసీఆర్ సోనియాగాంధీకి పార్లమెంటు సీట్లను పెంచి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని సూచించారని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసం కేంద్రం తెచ్చిన కొన్ని బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చినంత మాత్రాన ఆ పార్టీతో పొత్తు ఉన్నట్టు కాదని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!
స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్