Share News

కామారెడ్డిలో విషాదం.. బెదిరింపులు తట్టుకోలేక మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jul 16 , 2026 | 09:54 AM

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్‌పల్లికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో నమోదైన పోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత బాలిక తల్లిదండ్రుల బెదిరింపులతో మనస్తాపానికి గురై.. గ్రామ శివారులో యువకుడు ఉరేసుకున్నాడు.

కామారెడ్డిలో విషాదం.. బెదిరింపులు తట్టుకోలేక మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
Kamareddy News

కామారెడ్డి, జులై 16: దోమకొండ మండలం చింతామన్‌పల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంగబోయిన సందీప్ (23) అనే యువకుడు గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో పోక్సో(POCSO) కేసులో నిందితుడిగా ఉన్న సందీప్.. ఇటీవలే జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి బాలిక తల్లిదండ్రులు తనను తరచూ వేధిస్తూ.. బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


గ్రామ శివారులో సందీప్ మృతదేహం వేలాడుతుండటం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని సందీప్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణం వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలనూ చదవండి:

పిల్లలను వాహనాలపై ఒంటరిగా వదిలేస్తున్నారా? షాకింగ్ వైరల్ వీడియో

పెళ్లి కోసం యువకుడి తిప్పలు.. అమ్మాయి కావాలంటూ ఏకంగా రోడ్డుపై..

Updated Date - Jul 16 , 2026 | 11:49 AM