పెళ్లి కోసం యువకుడి తిప్పలు.. అమ్మాయి కావాలంటూ ఏకంగా రోడ్డుపై..
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:10 PM
మహారాష్ట్రలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కావటం లేదన్న బాధతో ఓ యువకుడు అందర్నీ ఆశ్చర్యపరిచే పని చేశాడు. అమ్మాయి కావాలంటూ బిల్‌బోర్డ్ ప్రకటన ఇచ్చాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: మహారాష్ట్రలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కావటం లేదన్న బాధతో ఓ యువకుడు అందర్నీ ఆశ్చర్యపరిచే పని చేశాడు. అమ్మాయి కావాలంటూ బిల్‌బోర్డ్ ప్రకటన ఇచ్చాడు. పుణె నగరంలోని కాతే పాటిల్ చౌక్‌లోని మెయిన్ రోడ్డు పక్కన ఉన్న బిల్‌బోర్డుపై రాఘవ్ విశ్వాస్‌రావ్ అనే యువకుడి ప్రకటన వెలుగుచూసింది. ఆ ప్రకటనలో.. ‘నా పేరు రాఘవ్ విశ్వాస్‌రావ్ షిండే. వయసు 30 సంవత్సరాలు. నేను నెలకు 25 వేల రూపాయలు సంపాదిస్తాను. నాకు కారు, సొంత ఇల్లు, పొలం లేదు. పెళ్లి కోసం ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్పండి’ అని ఉంది.
రోడ్డుపై వెళుతున్న రాకేశ్ అనే వ్యక్తి ఆ బిల్‌బోర్డును వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని వందల మంది ఈ వీడియోపై కామెంట్లు చేశారు. ‘ప్రకటన బాగానే ఉంది. కానీ, ఫోన్ నంబర్ ఇవ్వలేదు’..‘పెళ్లి కాని వాళ్ల తిప్పలు మీకేమి తెలుసు. ఆ యువకుడికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నా’..‘నాకు కూడా పెళ్లి కాలేదు. నేను కూడా ఇలా ప్రకటన ఇవ్వాలి కావచ్చు’ అంటూ స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రాజకీయాల కోసమే విశాఖలో వైఎస్ జగన్ పర్యటన: పల్లా శ్రీనివాస రావు
మాయంమశ్చీంద్ర.. జేఎన్‌టీయూలో సర్టిఫికెట్ల అదృశ్యం