Share News

పిల్లలను వాహనాలపై ఒంటరిగా వదిలేస్తున్నారా? షాకింగ్ వైరల్ వీడియో

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:42 PM

పిల్లలను వాహనాలపై ఒంటరిగా వదిలివెళ్లడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠాన్ని ఈ సంఘటన తెలియజేస్తోంది.

పిల్లలను వాహనాలపై ఒంటరిగా వదిలేస్తున్నారా? షాకింగ్ వైరల్ వీడియో
Child Scooter Accident

ఇంటర్నెట్ డెస్క్: పిల్లలను వాహనాలపై ఒంటరిగా వదిలివెళ్లడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో వాహనదారుల్లో తీవ్ర ఆందోళనను, ఆలోచనను రేకెత్తిస్తోంది. ఒక వ్యక్తి తన స్కూటర్‌పై ఇద్దరు పిల్లలతో వచ్చి, బండి ఆపిన తర్వాత ఒక చిన్నారిని దించడానికి వెళ్తాడు. అయితే, ఇంజిన్ ఆన్‌లోనే ఉంచి వెళ్లడంతో.. వెనుక కూర్చున్న మరో చిన్నారి యాక్సిలరేటర్ తిప్పుతుంది. దాంతో ఆ వాహనం ఒక్కసారిగా దూసుకెళ్లి, ఆ చిన్నారి కిందపడిపోతుంది. ఒక్క క్షణం పాటు ఆ వ్యక్తి చేసిన చిన్న పొరపాటు, నిర్లక్ష్యం ఎంతటి పెద్ద ప్రమాదానికి దారితీసిందో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది.


చిన్న పిల్లలను వాహనంపై తీసుకువెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనం ఆపిన వెంటనే ఇంజిన్ ఆఫ్ చేయాలి. ఇంజిన్ ఆన్‌లో ఉంచి పిల్లల్ని వాహనంపై ఉంచి వెళ్లడం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే.. ప్రతి ఒక్కరూ ప్రయాణాల్లో నిత్యం అప్రమత్తంగా ఉంటూ.. పిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ఈ వైరల్ వీడియో మనకు గుర్తుచేస్తోంది.

ఈ వీడియో @gharkekalesh అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘బాధ్యతారహితమైన వ్యక్తిని వాహనంపై ఎప్పుడూ ప్రయాణించనివ్వవద్దు’ అని, ‘బైక్ దిగేటప్పుడు ఎల్లప్పుడూ ఇంజిన్‌ను ఆపివేయాలి’ అని ఒకరు, ‘ఆ చిన్నారి క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నా’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కదులుతున్న రైలులో పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ వివరణ..

వయసు సంఖ్య మాత్రమే.. 80 ఏళ్ల వయసులో వృద్ధురాలి సాహసం..

Updated Date - Jul 14 , 2026 | 01:54 PM