Share News

జాన్వీ కపూర్ మార్ఫ్ వీడియో వివాదం.. కేసు నమోదు చేసిన పోలీసులు

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:06 PM

దేవర చిత్రంలోని ఓ పాటను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జాన్వీ కపూర్ మార్ఫ్ వీడియో వివాదం.. కేసు నమోదు చేసిన పోలీసులు
a Still from Chuttamalle song

హైదరాబాద్, అక్టోబర్ 4: నటి జాన్వీ కపూర్ ఏఐ మార్ఫ్ వీడియోపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేవర చిత్రంలోని ఓ పాటను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి మార్ఫింగ్ ఏఐ వీడియోలు తయారు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని అగ్రహీరోలు కూడా డిమాండ్ చేస్తున్నారు.


కాగా మార్ఫ్ వీడియోపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం సిగ్గుచేటన్నారు. వీటిని సృష్టించి, ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


ఈ వార్తలూ చదవండి

శ్రీదేవి కూతురికే ఎందుకు ఇలా జరుగుతోంది..

NTR: ఇది చాలా నీచం.. ఎవరిని వదిలిపెట్టను..

Updated Date - Oct 04 , 2026 | 05:14 PM