రికార్డు స్థాయిలో మోదీ పాలన.. దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మార్చడమే లక్ష్యం: ఎంపీ డీకే అరుణ
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:09 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం చారిత్రాత్మక మైలురాళ్లను అధిగమిస్తూ, రికార్డు స్థాయి పాలనతో ముందుకు సాగుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కొనియాడరు. వివరాల్లోకి వెళితే..
మహబూబ్‌నగర్, జూన్ 12: 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత్ భారత్’గా నిలపాలనే సుదూర లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం చారిత్రాత్మక మైలురాళ్లను అధిగమిస్తూ, రికార్డు స్థాయి పాలనతో ముందుకు సాగుతోందని డీకే అరుణ కొనియాడారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే రెండు కళ్లుగా భావించి ప్రధాని మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్లే నేడు భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆమె స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక రంగాన్నే కాకుండా, దేశ రక్షణకు పెద్దపీట వేస్తూ ఉగ్రవాదుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని డీకే అరుణ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ హయాంలో అమలువుతున్న విప్లవాత్మక సంక్షేమ పథకాలు, చారిత్రాత్మక నిర్ణయాలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్, జన్ ధన్ యోజన, జీఎస్టీ అమలు, త్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలతో దేశ ముఖచిత్రమే మారిపోయిందన్నారు. మహిళా సాధికారతకు కేంద్రం కట్టుబడి ఉందన్న ఆమె.. 2030 నాటికి దేశంలో 3 కోట్ల మంది మహిళలను ‘లఖ్‌పతి, కరోడ్‌పతి దీదీలు’గా మార్చడమే లక్ష్యంగా ప్రధాని విజన్‌తో పనిచేస్తున్నారని తెలిపారు. పీఎం కిసాన్, సుకన్య సమృద్ధి వంటి పథకాలు ప్రజల్లో ఎంతో భరోసానిచ్చాయని, ముఖ్యంగా రైతులకు ఎరువుల రూపంలో ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు భారీ రాయితీ అందుతోందని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్
26, 28 తేదీల్లో చెన్నై-తిరుపతి రైళ్ల రద్దు
Read Latest AP News And Telugu News