Share News

kumaram bheem asifabad- అసంపూర్తి పనులు.. రైతులకు అవస్థలు

ABN , Publish Date - May 01 , 2026 | 10:34 PM

- ఏళ్లుగా సాగు నీటి ప్రాజెక్టులపై పట్టింపు కరువు

kumaram bheem asifabad- అసంపూర్తి పనులు.. రైతులకు అవస్థలు
లోగో

- నీటి వనరులున్నా ఉపయోగ పడని వైనం

ఆసిఫాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రాజె క్టులు ఏళ్లుగా పూర్తి కాకపోవడంతో రైతాంగానికి సాగు నీరు అందని పరిస్థితి నెలకొన్నది. దీంతో జిల్లా రైతాంగానికి వర్షాధారమే సాగ దిక్కవుతోంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు. సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూమి నిరుప యోగంగా మారుతోంది. గత్యంతరం లేక ఆరుతడి పంటలతో సరిపెట్టాల్సి వస్తుంది. చివరి వానస్తే పంట లేకుంటే లేదు అన్న చందంగా మారుతోంది. కుమరం భీం ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో కాలేదు. మరోవైపు వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టు కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం జిల్లాలో సాగునీటి ప్రాజెకులకు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతులకు సాగునీరు అందక అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.

- 10 టీఎంసీల నిలువ సామర్థ్యంతో..

కుమరం భీం ప్రాజెక్టును 10 టీఎంసీల నిలువ సామర్థ్యంతో నిర్మించారు. కానీ ఆనకట్ట దెబ్బతినడంతో 5.8 టీఎంసీలకు మించి నీటిని నిలువ చేయడంలేదు. వరదనీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతున్న గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఆసిఫాబాద్‌ మండ లంలో కుడి కాలువ ద్వారా 6వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 39వేల ఎకరాలు ఆసిఫాబాద్‌ మండలంతో పాటు వాంకిడి, కాగజ్‌నగర్‌ మండలా లకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రాజెక్టు నిలువ సామర్థ్యం తగ్గించడం, కాలువలు అధ్వానంగా మార డంతో పంట పొలాలకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది.

- 24,500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా..

ఆసిఫాబాద్‌ మండలం వట్టివాగు నీటిని స్థానిక పొలాలకు అందించాలనే ఉద్దేశ్యంతో 1998లో 24,500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కుడి కాలువ ద్వారా 21,800 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 2700 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్దేశించారు. కాలువలు ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఆధునీకరణకు నోచుకోవడం లేదు. దీనికి తోడు ఇప్పటికే కాలువలు మొత్తం దెబ్బతిన్నాయి. లైనింగ్‌ కోల్పోయి చెట్లు ఏపుగా పెరిగి అధ్వానంగా మారాయి. చాలా చోట్ల కాలువలు నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో ఆసిఫాబాద్‌, రెబ్బెన మండలాల పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే స్థితిలో లేదు. అధికారులు ఆధునికీకరణ పనుల కోసం ప్రతిపా దనలను పంపినప్పటికీ వాటికి నిధులు విడుదల కాలేదు.

- పెద్దవాగుపై నిర్మించిన..

కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగజ్‌నగర్‌, దహెగాం మండలాల పరిధిలో 15,000 ఎక రాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టినప్పటికీ నత్తనడకన కొనసా గుతున్నాయి. భూ సేకరణ, తదితర సమస్యలతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో జాప్యంతో ఆయకట్టుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తమ భూములు పంట పొలాలుగా మారుతా యని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసు కోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

Updated Date - May 01 , 2026 | 10:34 PM