Share News

యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో... బీఎస్సీ కార్డియోవాస్క్యులర్‌ టెక్నాలజీ కోర్సు

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:30 AM

వైద్యరంగంలో నైపుణ్యం ఉన్న మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో బీఎస్సీ కార్డియోవాస్క్యులర్‌ టెక్నాలజీ కోర్సును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో... బీఎస్సీ కార్డియోవాస్క్యులర్‌ టెక్నాలజీ కోర్సు
Young India Skill University

  • ఏఐజీ ఆసుపత్రి సహకారం

హైదరాబాద్‌, నవంబరు4(ఆంధ్రజ్యోతి): వైద్యరంగంలో నైపుణ్యం ఉన్న మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో బీఎస్సీ కార్డియోవాస్క్యులర్‌ టెక్నాలజీ కోర్సును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు బుధవారం ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యం, స్కిల్‌ యూనివర్సిటీ అధికారులు సమీక్ష నిర్వహించారు. కోర్సు నిర్వహణకు ఏఐజీ సహకరించేందుకు ముందుకొచ్చింది.


2026 విద్యాసంవత్సరం బ్యాచ్‌తో నిర్వహించిన సమావేశంలో ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి, స్కిల్‌ యూనివర్సిటీ ఉపకులపతి వీఎల్‌వీఎస్‌ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ కోర్సులో ప్రవేశఅర్హతలు, ఫీజుల విధానం, పాఠ్యప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు. పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఉపాధి అవకాశాలకు అనుగుణమైన విద్యను అందించాలనే లక్ష్యంతో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, ఏఐజీ ఆసుపత్రులు కలిసి పనిచేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సదర్‌ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 06:30 AM