Share News

రబీ సీజన్‌కల్లా 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తి!

ABN , Publish Date - Nov 18 , 2026 | 07:13 AM

యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎ్‌స)లో పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి దిశగా తెలంగాణ జెన్‌కో అడుగులు వేస్తోంది.

రబీ సీజన్‌కల్లా 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తి!
Yadadri Thermal Power Plant

  • యాదాద్రిలో పూర్తి స్థాయిలో ఉత్పత్తికి ఏర్పాట్లు: జెన్‌కో

యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎ్‌స)లో పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి దిశగా తెలంగాణ జెన్‌కో అడుగులు వేస్తోంది. 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 యూనిట్లలో ఇప్పటికే నాలుగింట్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండగా, ఐదో యూనిట్‌ కూడా గ్రిడ్‌కు అనుసంధానమైంది. బొగ్గు సరఫరాలోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి, రానున్న రబీ సీజన్‌లో పూర్తి స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు జెన్‌కో సీఎండీ ఎస్‌.హరీశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని అవరోధాలు దాటుకొని రానున్న రబీ సీజన్‌లో 4,000 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.


ఇవి కూడా చదవండి...

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Read Latest National News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 07:13 AM