Share News

మహిషాసురమర్ధిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

ABN , Publish Date - Oct 20 , 2026 | 06:08 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ప్రధానాలయ సన్నిధిలోని శ్రీపర్వతవర్ధనీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహర్నవమి సందర్భంగా అమ్మవారు ‘మహిషాసురమర్ధిని’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మహిషాసురమర్ధిని అలంకారంలో  దర్శనమిచ్చిన అమ్మవారు
Mahishasura Mardini Alankaram

  • యాదగిరి నృసింహుడి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో ఆయుధ పూజలు

యాదాద్రి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ప్రధానాలయ సన్నిధిలోని శ్రీపర్వతవర్ధనీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహర్నవమి సందర్భంగా అమ్మవారు ‘మహిషాసురమర్ధిని’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చెడుపై మంచి విజయాన్ని చాటిచెప్పే రూపులో అమ్మవారికి భక్తులు పూజలు చేశారు. ఇలా ఉండగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆయుధపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ భద్రతా విధులు నిర్వహించే తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్‌పీఎఫ్‌) సిబ్బంది ఆయుధాలకు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపించారు


. లక్ష్మీనరసింహుడి సన్నిధిలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయంలో నుంచి లక్ష్మీనరసింహులను విశేషంగా అలంకరించి తిరువీధుల్లో ఊరేగించనున్నారు. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం విజయాలు సంప్రాప్తించాలని ఆలయ మాడవీధుల్లో శమీవృక్షం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి, సంప్రదాయరీతిలో వేడుకలను నిర్వహిస్తారు. అనంతరం ఆలయంలో అమ్మవారి కలశ ఉద్వాసన చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రేషన్‌ షాపుల్లో గోదుమ పిండి, నిత్యావసరాలు!

ఎల్‌నినోతో ప్రపంచానికే ముప్పు

34 నెలల్లో 12.4లక్షల పాసు పుస్తకాలు ఇచ్చాం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 06:09 AM