Share News

హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఘటనలో యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:16 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి ఎదులాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అయితే, సమీప బంధువైన మనోహర్‌తో ఆమెకు నిశ్చితార్థం చేశారు కుటుంబసభ్యులు. పెళ్లికి అంతా సిద్ధమైన తర్వాత.. వైద్య పరీక్షల్లో అతనికి ఎయిడ్స్ ఉందని తేలింది. అయితే..

హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఘటనలో యువతి ఆత్మహత్య
Hyderabad Crime News

హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఘటనలో సదరు యువతి(23) ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలోని తమ ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి.. ఎదులాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అయితే, సమీప బంధువైన మనోహర్‌తో ఆమెకు నిశ్చితార్థం చేశారు కుటుంబసభ్యులు. పెళ్లికి అంతా సిద్ధమైన తర్వాత వైద్య పరీక్షల్లో అతనికి ఎయిడ్స్ ఉందని తేలింది. దీంతో యువతి కుటుంబసభ్యులు మనోహర్‌తో పెళ్లికి నిరాకరించారు. ఇది మనసులో పెట్టుకున్న నిందితుడు తనను వివాహం చేసుకోవాలని ఆమెని పలుమార్లు బలవంతం చేశాడు. యువతి ఒప్పుకోకపోవడంతో ఈ ఏడాది మార్చి 11న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి బలవంతంగా హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించాడు.


అనంతరం మనోహర్ అక్కడ్నుంచి పారిపోయాడు. బాధిత యువతి విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మనోహర్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ ఉదంతం మెుత్తాన్ని అవమానకరంగా భావించిన యువతి ఈరోజు మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి

వరంగల్ తల్లీకూతుళ్ల హత్య కేసు.. పది మంది అరెస్ట్

పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు ఇస్తాం: మంత్రి సీతక్క..

Updated Date - Apr 10 , 2026 | 06:27 PM