Share News

సాఫ్ట్‌వేర్ సీతారామ్ సూసైడ్‌ కేసులో ట్విస్ట్..

ABN , Publish Date - May 01 , 2026 | 07:34 PM

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సీతారామ్ సూసైడ్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే. భార్య వేరే వ్యక్తితో పారిపోవడంతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో తాజాగా సీతారామ్ భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

సాఫ్ట్‌వేర్ సీతారామ్ సూసైడ్‌ కేసులో ట్విస్ట్..
Woman Marries Lover

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: భర్త చనిపోయి నెల రోజులు కాకముందే ఓ మహిళ తన ప్రియుడిని వివాహం చేసుకుంది. భార్యకు పలువురితో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న భర్త.. ఆమె మోసాన్ని భరించలేక ఇటీవల ప్రాణాలు తీసుకున్నాడు. తాను ఎంతో ప్రేమించిన భార్యను ఇతరులతో చూసి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనను విడిచి ప్రియుడితో పారిపోయిందని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. తాజాగా మహిళను, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.


బాచుపల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సీతారామ్ సూసైడ్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే. భార్య మోసం చేసిందంటూ ఫిబ్రవరి నెలలో హుస్సేన్ సాగర్‌లో దూకి టెకీ ప్రాణాలు తీసుకున్నాడు. అతనికి సంబంధించిన 19 పేజీల సూసైడ్ నోట్ సంచలన విషయాలు వెల్లడించింది. తన భార్యకు ఆరుగురితో వివాహేతర సంబంధం ఉందని, వాటిని కళ్లాలా చూసి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నట్లు బాధితుడు తెలిపాడు. భార్యపై ఎంతో నమ్మకం పెట్టుకున్నానని, ఆమె మాత్రం సోషల్ మీడియాలో పరిచయమైన యువకులతో తిరుగుతూ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వారితో ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను చూసి భరించలేకపోయినట్లు పేర్కొన్నాడు. ఇటీవల ఆమె ప్రియుడితో పారిపోవడంతో కుంగిపోయినట్లు లేఖలో పేర్కొన్నాడు.


టెకీ సీతారామ్ ఆత్మహత్య గత నెలలో ప్రకంపనలు సృష్టించింది. తమ కోడలి వల్లే కుమారుడు మృతిచెందాడంటూ బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమెను అరెస్టు చేయాలని బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేశారు. అయితే, సీతారామ్ చనిపోయి నెల రోజులు కాకముందే మార్చి నెలలోనే వారిద్దరూ వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. వివరాలు వెల్లడించిన ఎంపీ అరుణ..

టెండర్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు..

Updated Date - May 01 , 2026 | 09:40 PM