శంషాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
ABN , Publish Date - May 01 , 2026 | 05:16 PM
శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
హైదరాబాద్, మే 1: శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకోగానే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును యంత్రాల సహాయంతో బయటకు తీస్తున్నారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16వ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ TS 23 F 2298 అని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదగిరిగుట్ట వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని
ఫామ్‌హౌస్ అడ్డాగా సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు.. వెలుగులోకి వీడియో..
For More AP News And Telugu News