Share News

కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని

ABN , Publish Date - May 01 , 2026 | 02:33 PM

గుంటూరులో శంకర్ విలాస్ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి కోసం చేపట్టిన భూ సేకరణ జులై నాటికి పూర్తి అవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.

కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరు, మే1: నగరంలోని శంకర్ విలాస్ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి కోసం చేపట్టిన భూ సేకరణ జులై నాటికి పూర్తి అవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. మరో పది రోజుల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ -3 పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు.


శుక్రవారం గుంటూరులో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. నార్ల వెంకటేశ్వర రావు ఆడిటోరియం అభివృద్ధికి బిడ్డింగ్ పూర్తయిందన్నారు. వేసవిలో ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.


కొత్తగా 220 ఈ ఆటోలు గుంటూరు నగర పాలక సంస్థకి రానున్నాయని వివరించారు. దీని ద్వారా నగరంలో చెత్త సేకరణ మరింత సులువు అవుతుందని తెలిపారు. మే నెల చివరి నాటికి నగరంలో డ్రైన్ల నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు.


నగరంలో 22 పార్కుల అభివృద్ధికి రూ.7.2 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. పార్కుల్లో పిల్లలకు ఆట వస్తువులతోపాటు జిమ్ పరికరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నగరంలో వీధి కుక్కల సమస్య అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నెలకు 125 వీధి కుక్కలకు ఆపరేషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీలపై డీజీపీ సీవీ ఆనంద్ క్లారిటీ

ఫామ్‌హౌస్ అడ్డాగా సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు.. వెలుగులోకి వీడియో..

For More AP News And Telugu News

Updated Date - May 01 , 2026 | 03:26 PM