Share News

ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వైద్యుల హాజరు తక్కువ

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:33 AM

అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే విధంగా వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో  వైద్యుల హాజరు తక్కువ

  • నిర్లక్ష్యం వహిస్తే.. వైద్యులతో పాటు డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌వో పైనా చర్యలు: దామోదర

అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే విధంగా వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. త్వరలోనే ఇందులో వైద్య సేవలు ప్రారంభించి, ప్రజలకు అంకితం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రుల అభివృద్థిపై ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు.


సెక్రటేరియట్‌లో జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎ్‌సలు పాల్గొన్నారు. వరంగల్‌, హన్మకొండ సహా పలు జిల్లాల్లోని సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్యుల హాజరు తక్కువగా ఉంటోందని, డీసీహెచ్‌ఎ్‌సలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులను ఆకస్మిక తనిఖీలకు పంపుతామని, రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత హాస్పిటల్‌ మెడికల్‌ ఆఫీసర్‌, సూపరింటెండెంట్‌తో పాటు డీసీహెచ్‌ఎస్‌, డీఎంహెచ్‌వోపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.


ఈ వార్తలూ చదవండి

నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 28 , 2026 | 05:33 AM