Share News

విద్యార్థులు రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యమివ్వాలి

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:17 AM

వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయ 6వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వీఐటీ విశ్వవిద్యాలయ ఫౌండర్‌-చాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, గౌరవ అతిథిగా ..

విద్యార్థులు రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యమివ్వాలి
VIT AP 6th convocation

  • రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌

  • వీఐటీ ఏపీలో ఘనంగా 6వ స్నాతకోత్సవం

తుళ్లూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయ 6వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వీఐటీ విశ్వవిద్యాలయ ఫౌండర్‌-చాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, గౌరవ అతిథిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, అకడమిక్‌ అలయన్స్‌ గ్రూప్‌ హెడ్‌ డాక్టర్‌ కేఎం సుశీంద్రన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ, స్నాతకోత్సవం విద్యార్థి జీవితంలో ఒక కీలకమైన పరివర్తన దశ అని తెలిపారు. విద్యార్థి విశ్వవిద్యాలయంలో పొందిన జ్ఞానం ఇకపై సమాజంలో తన ప్రయాణాన్ని ప్రారంభించే సందర్భమని పేర్కొన్నారు.


విద్యార్థులు తమ వృత్తి జీవితంలో నిరంతరం నేర్చుకోవాలని సూచించారు. డాక్టర్‌ సుశీంద్రన్‌ మాట్లాడుతూ, విద్యార్థులు తమ అకాడమిక్‌ పరిజ్ఞానాన్ని పరిశ్రమ అవసరాలతో అనుసంధానించుకోవాలని తెలపారు. డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ స్నాతకోత్సవంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ పి.అరుళ్‌మొళివర్మన్‌, వీఐటీ వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌ విశ్వనాథన్‌, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాదంబరి ఎస్‌.విశ్వనాథన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో 3,877 మంది డిగ్రీ పట్టాలను అందుకున్నారు. వీరిలో 86 మంది పీహెచ్‌డీ, 31 మంది బంగారు పతకాలు, 133 మంది ర్యాంకులు సాధించారు.


ఈ వార్తలు కూడా చదవండి:
దురుద్దేశంతోనే దిగుమతి సుంకం తగ్గింపు

గచ్చిబౌలి ‘అంతేరా’ సహా.. 11 రెస్టారెంట్ల లైసెన్స్‌లు రద్దు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 05:18 AM