Share News

మాయమాటలతో బాలికను లోబర్చుకొని.. ఆ ఘటనంతా వీడియో తీసిన 17 ఏళ్ల బాలుడు

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:52 AM

పదమూడేళ్ల బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. ఆమెతో సన్నిహితంగా ఉంటూ కొన్నాళ్లకు అత్యాచారానికి పాల్పడ్డాడో బాలుడు (17)! బాలికతో తాను సన్నిహితంగా ఉన్న వీడియోను స్నేహితులకు చూపించడంతో వారు ఆ బాలికను వేధింపులకు గురిచేశారు.

మాయమాటలతో బాలికను లోబర్చుకొని..  ఆ ఘటనంతా వీడియో తీసిన 17 ఏళ్ల బాలుడు
Vikarabad POCSO Case

  • ఆ వీడియో ఆధారంగా ఆమెపై అతడి స్నేహితుల వేధింపులు

  • బెదిరించి ఆమెపై అత్యాచారంవికారాబాద్‌ జిల్లాలో ఘటన

  • ఐదుగురు మైనర్లు సహా ఆరుగురు నిందితులు

  • పోక్సో కేసు.. ఇద్దరి అరెస్ట్‌

దోమ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పదమూడేళ్ల బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. ఆమెతో సన్నిహితంగా ఉంటూ కొన్నాళ్లకు అత్యాచారానికి పాల్పడ్డాడో బాలుడు (17)! బాలికతో తాను సన్నిహితంగా ఉన్న వీడియోను స్నేహితులకు చూపించడంతో వారు ఆ బాలికను వేధింపులకు గురిచేశారు. తమతోనూ సన్నిహితంగా గడపాలని ఆమెపై ఒత్తిడి తెచ్చి అత్యాచారానికీ పాల్పడ్డారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా దోమ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు 8వ తరగతి విద్యార్థిని! ఆమెను వేధింపులకు గురిచేసిన వారిలో ప్రధాన నిందితుడు సహా ఐదుగురు మైనర్లతో కలిపి మొత్తంగా ఆరుగురు ఉన్నారు! ఆరోవ్యక్తి వయసు 35 ఏళ్లు కావడం గమనార్హం.


స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు, బాధితురాలు ఒకే గ్రామానికి చెందినవారు.. పైగా ఇరుగుపొరుగు వారే! ప్రధాన నిందితుడైన బాలుడు చదువు మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. ప్రేమ పేరుతో బాలికతో దగ్గరై ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది వీడియో ద్వారా తెలుసుకున్న అతడి నలుగురు స్నేహితుల్లో కొందరు ఆమెను బెదిరింపులకు గురిచేసి.. అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘోరాన్ని బాధితురాలు 15న తల్లిదండ్రులకు చెప్పుకొంది. ఘటనపై 18న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారేమో ఊర్లోనే పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని సూచించి పంపించివేశారు. అయితే.. వ్యవహారం చివరికి మళ్లీ పోలీసుల దాకా వెళ్లడం, బాధితురాలి తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఆరుగురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమ్ముకునేందుకే ఆయుధాల చోరీ!
4 జిల్లాలకు వరదముప్పు
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 05:52 AM