4 జిల్లాలకు వరదముప్పు
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:36 AM
బంగాళాఖాతంలో వాయుగుండం మంగళవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీంతో తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉంద ని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరించింది.
భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో కుంభవృష్టి
భారత వాతావరణ శాఖ హెచ్చరిక
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
నేటి రాత్రి తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో వాయుగుండం మంగళవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీంతో తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉంద ని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరించింది. భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుంభవృష్టితో ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని తెలిపింది. తీవ్ర వేగంతో గాలులు వీస్తాయని.. చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి తూర్పుగా 220 కి.మీ., కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 140 కి.మీ, గోపాలపూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి బుధవారం రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్‌కు మధ్య తీరం దాటనున్నదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. కాగా, తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడే అవకాశం లేదని ఐఎండీ అధికారులు స్పష్టంచేయగా, కొందరు వాతావరణ నిపుణులు మాత్రం ఒక మోస్తరు తుఫాన్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు
అన్నేళ్లు లైంగిక వేధింపులు ఎందుకు భరించారు?
Read Latest Telangana News And AP News And National News
And Telugu News