Share News

ధరణి ముసుగులో రికార్డులు తారుమారు

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:19 AM

ధరణి పోర్టల్‌ను అడ్డు పెట్టుకుని రికార్డులను తారుమారు చేసి, తాతముత్తాతల కాలం నుంచి తాము సాగు చేసుకుంటున్న భూములను మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో కలిపేసుకున్నారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం శివారు వెంకటాపూర్‌ నిర్వాసిత రైతులు ఫిర్యాదు చేశారు.

ధరణి ముసుగులో రికార్డులు తారుమారు
Ponguleti Srinivas Reddy

  • మా భూములు 325 సర్వే నంబరులో కలిపేసుకున్నారు

  • మంత్రి పొంగులేటికి వెంకటాపూర్‌ రైతుల ఫిర్యాదు

  • అర్హులకు న్యాయం చేస్తానని మంత్రి పొంగులేటి హామీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ను అడ్డు పెట్టుకుని రికార్డులను తారుమారు చేసి, తాతముత్తాతల కాలం నుంచి తాము సాగు చేసుకుంటున్న భూములను మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో కలిపేసుకున్నారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం శివారు వెంకటాపూర్‌ నిర్వాసిత రైతులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామంలోని 38, 41, 85, 88, 100 సర్వే నంబర్ల పరిధిలోని సుమారు 134 ఎకరాల వ్యవసాయ భూములను తాము తమ తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని బాధితులు తెలిపారు. కానీ, రాష్ట్రంలో ధరణి అమలులోకి వచ్చాక రికార్డులు తారుమారు చేసి తమకు హక్కుల్లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఓవర్‌ మ్యాపింగ్‌ పేరుతో వెంకటాపూర్‌ గ్రామ వ్యవసాయ భూములను ఎర్రవెల్లి గ్రామంలోని 325వ సర్వే నంబరులో కలిపి నక్షా రూపొందించారని, దీని వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రికి వివరించారు. ధరణికి ముందు తమ వద్ద గల పట్టా పాస్‌ పుస్తకాలు, గ్రామ నక్షా పటాలను ఆయనకు అందజేశారు. ఎర్రవెల్లిలోని 325 సర్వే నంబరు పరిధిలో మాదిరిగానే తమ గ్రామంలోనూ సమగ్ర సర్వే నిర్వహించి.. సరిహద్దులు నిర్ణయించి.. తమ భూములు తమకు తిరిగి అప్పగించాలని వెంకటాపూర్‌ రైతులు విజ్ఞప్తి చేశారు. దేవాసుకుంట, ముత్తిలింగం కుంటలనూ పాండురంగ జలాశయంలో విలీనం చేశారని తెలిపారు. రైతుల సమస్యలను విన్న మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలను నిర్ధారిస్తామని వారికి హామీ ఇచ్చారు. అర్హులైన రైతులకు అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..
తెలంగాణలో పెట్టుబడికి విస్తృత అవకాశాలు

ఎకరం 250 కోట్ల ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ టవర్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 05:20 AM