Share News

తెలంగాణలో పెట్టుబడికి విస్తృత అవకాశాలు

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:09 AM

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ముఖ్యంగా హైదరాబాద్‌ పెట్టుబడులకు అనుకూల ప్రాంతంగా అభివృద్ధి చెందిందని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు.

తెలంగాణలో పెట్టుబడికి విస్తృత అవకాశాలు
Gaddam Prasad Kumar

  • ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన సమావేశంలో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ముఖ్యంగా హైదరాబాద్‌ పెట్టుబడులకు అనుకూల ప్రాంతంగా అభివృద్ధి చెందిందని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఇన్నోవేషన్‌ వంటి రంగాల్లో హైదరాబాద్‌ ప్రత్యేక గుర్తింపు పొందిందని చెప్పారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు తమ మాతృభూమితో అనుబంధాన్ని కొనసాగిస్తూనే, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. జర్మనీతో పాటు యూరప్‌ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణలో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని సూచించారు.


ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న స్పీకర్‌ ప్రాద్‌కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నేతృత్వంలోని అసెంబ్లీ ప్రతినిధి బృందం.. మంగళవారం ఫ్రాంక్‌ఫర్ట్‌లోని భారత కాన్సులేట్‌ కార్యాలయంలో ‘తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు - తెలుగు ప్రవాసులతో అనుసంధానం’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన ప్రవాసులు రాష్ర్టానికి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను తీసుకురావడంలో గొప్ప వారధిగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రసాద్‌కుమార్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకా్‌షలను భారత కాన్సులేట్‌ ప్రతినిధులు సత్కరించారు.


ఇవి కూడా చదవండి..
నవంబరు 19 నుంచి రాజీవ్‌ యువ వికాసం

ఎకరం 250 కోట్ల ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ టవర్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 05:09 AM