Share News

భారత్‌ను భయంతో కాదు.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంతో నడపాలి: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Jul 23 , 2026 | 04:11 PM

యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని భయపెట్టలేరని.. రాజ్యాంగాన్ని అణచలేరన్నారు.

భారత్‌ను భయంతో కాదు.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంతో నడపాలి: మంత్రి ఉత్తమ్
Uttam Kumar Reddy

హైదరాబాద్, జులై 23: యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని భయపెట్టలేరని.. రాజ్యాంగాన్ని అణచలేరన్నారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్బంధాలు సరికాదని అన్నారు. ఉద్యోగాలు అడిగిన యువతకు లాఠీలు, కేసులే బీజేపీ సమాధానమనమంటూ విమర్శలు గుప్పించారు. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కే అని చెప్పుకొచ్చారు. విద్యార్థుల స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పని వ్యాఖ్యానించారు.


యువత భవిష్యత్తుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. విద్యార్థుల మధ్య నిలిచిన రాహుల్ గాంధీ నిజమైన ప్రజానాయకుడన్నారు. ప్రజల మధ్య ఉండే నాయకత్వానికే దేశం మద్దతిస్తుందని తెలిపారు. భయపెట్టి ప్రజల స్వరాన్ని శాశ్వతంగా అణచలేరని అన్నారు. విద్యార్థుల కలలను సంకెళ్లతో బంధించలేరని స్పష్టం చేశారు. యువత ఆశయాలను జైళ్ల గోడల మధ్య నిర్బంధించలేరన్నారు. రాజ్యాంగాన్ని ఎవరూ ఓడించలేరని.. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ చారిత్రక బాధ్యత అని వెల్లడించారు. ‘యువత విద్వేషం కాదు... విశ్వాసం కోరుకుంటోంది. అహంకారం కాదు... జవాబుదారీతనం కోరుకుంటోంది. ప్రచారం కాదు... పారదర్శక పాలననే యువత కోరుకుంటోంది’ అంటూ వ్యాఖ్యానించారు.


2029 ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణకు కీలకమని ఉత్తమ్ వెల్లడించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అందిస్తోందన్నారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తోందని తెలిపారు. ప్రజల గొంతు వినే ప్రభుత్వాలే చరిత్రలో నిలుస్తాయన్నారు. ‘భారత్‌ను భయంతో కాదు.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంతో నడపాలి’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్ ఆత్మహత్య

'ఆయనవన్నీ వేరే పార్టీలు'.. కేటీఆర్ దావత్‌పై రేవంత్ సెటైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 04:19 PM