Share News

అర్ధరాత్రి వైసీపీ నేతల మద్యం పార్టీ.. ఎక్సైజ్ అధికారుల దాడి.. కేసు నమోదు

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:05 PM

కృష్ణా జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడు మెరుగుమాల ఖాళీ పుట్టినరోజు పార్టీలో రచ్చ చోటు చేసుకుంది. గుడివాడ టీచర్స్ కాలనీలోనీ ఓ భవనం పైఅంతస్తులో 100 మందితో అర్ధరాత్రి మద్యం పార్టీ నిర్వహించారు.

అర్ధరాత్రి వైసీపీ నేతల మద్యం పార్టీ.. ఎక్సైజ్ అధికారుల దాడి.. కేసు నమోదు
Krishna District News

కృష్ణా జిల్లా, జులై 23: కృష్ణా జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడు మెరుగుమాల ఖాళీ పుట్టినరోజు పార్టీలో రచ్చ చోటు చేసుకుంది. గుడివాడ టీచర్స్ కాలనీలోనీ ఓ భవనం పైఅంతస్తులో 100 మందితో అర్ధరాత్రి మద్యం పార్టీ నిర్వహించారు. వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఫొటో పట్టుకుని.. జిందాబాద్, జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మద్యం సేవించి అర్ధరాత్రి హల్‌చల్ చేశారు. వైసీపీ నేతల రచ్చతో ఇబ్బందులకు గురైన ఇరుగురుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే వన్ టౌన్ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అక్కడకు చేరుకుని మద్యం పార్టీపై దాడి చేశారు.


పార్టీలో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లను గుర్తించారు. విదేశీ మద్యం ఉన్నట్లు సమాచారం. పార్టీలో పాల్గొన్న వారిలో వైసీపీ నేతలు, పలువురు రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఖాళీపై కూడా ఇప్పటికే రౌడీషీట్ నమోదైంది. ఎక్సైజ్ అనుమతి లేకుండా భారీ మద్యం పార్టీ నిర్వహించడంతో బాటిళ్లను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నిర్వహించడంపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

సీజేపీ ఉద్యమంపై స్పందించిన సల్మాన్ ఖాన్.. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పోస్టు..

అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ చాలా గొప్పగా ఉన్నాయి: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 01:00 PM