డీలిమిటేషన్‌తో పౌరుల హక్కులకు భంగం
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:45 AM
నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల హక్కులు, ప్రాతినిథ్యం దెబ్బతినే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
రాహుల్ పోరుకు సంఘీభావం: ఉత్తమ్
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల హక్కులు, ప్రాతినిథ్యం దెబ్బతినే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2027 జనగణన, కుల గణనకు బదులుగా 2011 జన గణన లెక్కల ఆధారంగా పునర్విభజనతో 2051 వరకూ స్థానాల కేటాయింపును స్తంభింప చేయడంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం లభించదని పేర్కొన్నారు. పునర్విభజనకు వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధైర్యవంతంగా చేస్తున్న పోరాటం.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, అన్ని వర్గాల రాజకీయ హక్కులు కాపాడే కీలక పోరాటమన్నారు. రాహుల్ పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై రాహుల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల విశ్వసనీయతపై గల ఆందోళనను నియోజకవర్గాల పునర్విభజనకు రాహుల్ ముడి పెట్టారని చెప్పారు. ఇప్పటికే ఆమోదించిన 33 శాతం మహిళా రిజర్వేషన్‌ను ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లోనే అమలు చేయొచ్చన్న రాహుల్ సూచనను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఓబీసీ మహిళలకు ఉపకోటా కల్పించాలని, పక్షపాత రహిత బహుళ పక్ష నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కోరారు. ‘అధికార వాద, అప్రజాస్వామిక పద్ధతులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ.. దేశభక్తితో ఽపోరాడుతున్నారు. మంచి కాలంలోనైనా, కష్టకాలంలోనైనా ఆయనకు మేం అండగా ఉంటాం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రతి భారతీయుడికి న్యాయమైన ప్రాతినిధ్యం పరిరక్షణకు మా పోరాటం కొనసాగుతుంది’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News