‘ఆయిల్‌ఫెడ్’లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:57 AM
బషీర్‌బాగ్‌లోని ఆయిల్‌ఫెడ్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిపాలన విభాగానికి చెందిన అధికారులు నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకపోవడాన్ని గమనించిన ఆయన.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమయపాలన పాటించని అధికారులపై ఆగ్రహం
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): బషీర్‌బాగ్‌లోని ఆయిల్‌ఫెడ్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిపాలన విభాగానికి చెందిన అధికారులు నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకపోవడాన్ని గమనించిన ఆయన.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి సమయ పాలన పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, రైతులకు మొక్కల సరఫరా, నర్సరీల నిర్వహణ, డ్రిప్ వ్యవస్థల ఏర్పాటు, ఆయిల్‌పామ్ కర్మాగాల పని తీరుపై చర్చించారు. ఏడాదికి 2లక్షల ఎకరాల ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆయిల్‌ఫెడ్, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.. అశ్వారావుపేట, అప్పారావుపేట, నర్మెట్టలోని ప్రాసెసింగ్ మిల్లులు పూర్తి సామర్థ్యంతో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణంలో ఉన్న 6 ఆయిల్ మిల్లుల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న డ్రిప్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. గెలల సేకరణలో అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అరగంటపాటు గుండెను ఆపి.. ఆపరేషన్!
బీసీ సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం
Read Latest AP News And Telangana News And International News And Telugu New