Share News

హామీలు నెరవేర్చకుంటే రాళ్లతో కొట్టండి: టీఆర్ఎస్ ఛీప్ కవిత..

ABN , Publish Date - May 02 , 2026 | 09:30 PM

తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తామిచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలన్నారు.

హామీలు నెరవేర్చకుంటే రాళ్లతో కొట్టండి: టీఆర్ఎస్ ఛీప్ కవిత..
TRS Chief Kavitha

హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తామిచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన తండ్రి కేసీఆర్‌తో ఎలాంటి పంచాయితీ లేదని.. బీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఆయన్ను విమర్శించానని చెప్పారు. కేసీఆర్‌ను రాజకీయ నేతగానే విమర్శించానని, తండ్రిగా ఆయనతో ఎలాంటి సమస్య లేదని చెప్పారు.


ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తెలంగాణ ప్రజల కోసం తాను ముందుకే వెళ్తానని టీఆర్ఎస్ చీఫ్ కవిత చెప్పారు. తన టార్గెట్ సర్వోదయ తెలంగాణ సాధించటమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఎవరైతే విలనో.. తనకూ వాళ్లే విలన్ అని చెప్పారు. అన్ని విషయాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే పాంచజన్యం, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు హామీ ఇచ్చానని కవిత చెప్పారు. గత 20 ఏళ్లుగా తనను చూస్తున్నారని ఇచ్చిన మాట, పట్టిన తోవను విడవకుండా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో విద్య, వైద్యం కోసమే ప్రజలు 60 శాతం డబ్బు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కచ్చితంగా సంకల్పం తీసుకుంటే ఇది సాధ్యమేనని చెప్పారు. ఆరోగ్య శ్రీ ప్రారంభించినప్పుడు, విద్యార్థులకు ఫ్రీ మీల్స్ పెట్టినప్పుడూ ఇది సాధ్యమా? అంటూ చాలా ప్రశ్నలు వచ్చాయన్నారు. కానీ, ఇప్పుడు వాటిని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.


పాంచజన్యంలోని ఐదు అంశాలను అమలు చేయటంపై ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపానని కవిత చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో లక్ష కోట్ల రూపాయలను తమ ప్రాధాన్య అంశాలకు ఖర్చు చేయవచ్చన్నారు. చేయాలన్న సంకల్పం ఉంటే చాలు ఇదంతా సాధ్యమేనని స్పష్టం చేశారు. తల్లిలా తాను పరిణితి చెందుతానంటే చాలా మంది విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తల్లి మాదిరి లాలన లేని కారణంగానే ఈరోజు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తల్లి మాదిరిగా ఆలోచిస్తే మాత్రమే ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం వస్తుందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి అది చేతకావటం లేదని.. వెయ్యి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక తల్లి మాదిరిగా తెలంగాణలో పాలన చేస్తామని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..

విషాదం.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Updated Date - May 02 , 2026 | 09:45 PM