Share News

దారుణం.. ప్రేమజంటపై బెదిరింపులు, బాలికపై సామూహిక అత్యాచారం

ABN , Publish Date - May 02 , 2026 | 08:58 PM

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న ఓ ప్రేమ జంటపై దుండగులు దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే..

దారుణం.. ప్రేమజంటపై బెదిరింపులు, బాలికపై సామూహిక అత్యాచారం
Mahabubnagar Crime

మహబూబ్ నగర్, మే 02: జిల్లాలోని హన్వాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న ఓ ప్రేమ జంటపై దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ప్రియుడిని బెదిరించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నగర శివారులోని ఓ మైదాన ప్రాంతానికి ప్రేమ జంట వెళ్లింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన దుండగులు వారిని అడ్డుకున్నారు. ప్రియుడిని భయపెట్టి ఆయన వద్దనున్న డబ్బును బలవంతంగా లాక్కున్నారు.


వెంటనే అప్రమత్తమైన ప్రియుడు.. పోలీస్ సహాయం కోసం డయల్ 100కు కాల్ చేశాడు. అయితే.. పోలీసులు వచ్చేలోపే దుండగులు బాలికపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను రక్షించి ప్రాథమిక విచారణ చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా

బతుకమ్మ కుంట వివాదంపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.

Updated Date - May 02 , 2026 | 09:29 PM