Share News

విషాదం.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - May 02 , 2026 | 08:58 PM

హైదరాబాద్‌ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.

విషాదం.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Meerpet Police Station Incident

రంగారెడ్డి జిల్లా: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన కుటుంబం.. రెండేళ్లుగా బడంపేట్ న్యూ మారుతి నగర్‌లో నివాసముంటోంది. ఈ కుటుంబానికి చెందిన ఓ యువతి గండిపేటలోని ఎంజీఐటీ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.


రోజూలాగే కాలేజీకి వెళ్లిన ఆమె ఈ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిందని.. ఆ తర్వాత ఇంట్లో ఉన్న డీజిల్‌ను పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే మీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


Also Read:

నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..

For More Latest News

Updated Date - May 02 , 2026 | 09:34 PM