Share News

మెడికల్ కాలేజీ విద్యార్థినిలపై లైంగిక వేధింపులు.. ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు..

ABN , Publish Date - May 02 , 2026 | 08:32 PM

విజ‌య‌వాడ‌లోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య క‌ళాశాల‌లో విద్యార్థినిలపై లైంగిక వేధింపుల ఘటనపై సీఎం చంద్రబాబు సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు బాధ్యులపై వైద్యారోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది.

మెడికల్ కాలేజీ విద్యార్థినిలపై లైంగిక వేధింపులు.. ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు..
Nori Ramasastry Ayurveda College

విజ‌య‌వాడ‌: డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య క‌ళాశాల‌లో విద్యార్థినిలపై లైంగిక వేధింపుల ఘటనపై సీఎం చంద్రబాబు సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు బాధ్యులపై వైద్యారోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది. మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ డాక్టర్ డి.మౌళి నాయ‌క్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్ కె.వి.సుబ్రహ్మణ్యంపై సస్పెన్షన్ వేటు వేసింది.


అలాగే విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన క‌ళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.నిర్మలా జ్యోతిబాయి, పీఎస్పీ విభాగానికి చెందిన ప్రొఫెస‌ర్ కె.విజ‌య‌ కుమారిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ వివరాలను ఆయుష్ ఇన్‌ఛార్జ్ క‌మిష‌న‌ర్ రోణంకి గోపాల‌కృష్ణ వెల్లడించారు. అలాగే లైంగిక వేధింపుల‌కు సంబంధించి క‌ళాశాల‌లో అంత‌ర్గతంగా విచారణ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. లైగింక వేధింపుల ఘటనపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.ల‌క్ష్మీశాకు లేఖ రాసినట్లు రోణంకి వెల్లడించారు. ఆ లేఖలో స్వతంత్ర క‌మిటీ ద్వారా విచార‌ణ జరిపించాలని లక్ష్మీశాను కోరినట్లు కమిషనర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

జైల్లో ప్రత్యేక సదుపాయాలు కోరిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు

కుటుంబ కలహాల విషాదం.. పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషమిచ్చిన తండ్రి

Updated Date - May 02 , 2026 | 08:32 PM