‘సర్’ సిబ్బందికి పారితోషికం ఇవ్వండి
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:37 AM
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐదు నెలలుగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బందికి పారితోషికం మంజూరు చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ సంఘం (ట్రెసా) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది.
సీఈవో సుదర్శన్‌రెడ్డికి ట్రెసా విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐదు నెలలుగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బందికి పారితోషికం మంజూరు చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ సంఘం (ట్రెసా) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు గౌతం కుమార్, రమణ్‌రెడ్డి గురువారం ఆయనకు వినతిపత్రం అందజేశారు.
ఓటర్ల వివరాల పరిశీలన, ఇంటింటికి వెళ్లి తనిఖీలు, రేషనలైజేషన్, డ్రాఫ్ట్ ప్రచురణ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ తదితర ఎన్నికల విధుల్లో ఏఈఆర్వోలుగా, ఈఆర్వోలుగా తహసీల్దార్లు, ఆర్డీవోలు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా పని పూర్తి చేసేందుకు వారు రాత్రి, పగలు కష్టపడి పని చేస్తున్నారని, పారితోషకం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని సీఈవో సుదర్శన్‌రెడ్డి ట్రెసా ప్రతినిధులకు హామీ ఇచ్చారని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
భర్తను చంపించి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..
బాలికలతో అసభ్య ప్రవర్తన.. తండ్రీకొడుకుల అరెస్టు
Read Latest Telangana News And Telugu News