Share News

బాలికలతో అసభ్య ప్రవర్తన.. తండ్రీకొడుకుల అరెస్టు

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:48 AM

ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌ బాలికలతో వేర్వేరుగా అసభ్యకరంగా ప్రవర్తించిన తండ్రీకొడుకులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

బాలికలతో అసభ్య ప్రవర్తన.. తండ్రీకొడుకుల అరెస్టు
Alwal POCSO case

  • పోక్సో కేసు నమోదు, రిమాండ్‌కు తరలింపు

అల్వాల్‌, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌ బాలికలతో వేర్వేరుగా అసభ్యకరంగా ప్రవర్తించిన తండ్రీకొడుకులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అల్వాల్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అల్వాల్‌కు చెందిన మహిళ సెప్టెంబరు 30వ తేదీ సాయంత్రం తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి వస్తువుల కొనుగోలుకు వెళ్లింది.


ఆ సమయంలో ఆ మహిళ మరో ఇద్దరు కుమార్తెలు(9ఏళ్లు, 12ఏళ్లు) ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. తల్లి ఇంటికి తిరిగొచ్చేసరికి చిన్నారులిద్దరూ ఏడుస్తూ వచ్చారు. ఏమైందని ప్రశ్నించగా.. ఎదురుఅపార్ట్‌మెంట్‌లో నివసించే జావేద్‌(48) కిటికీ వద్దకు వచ్చి తమ వైపు చూస్తూ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. అంతేకాక తన వైపు రావాలని సైగలు చేశాడని తెలిపారు. అలాగే, జావేద్‌ కుమారుడు యూసఫ్‌(22) కూడా గతంలో తమ పట్ల ఇలానే అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయారు. బాలిక తల్లి అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.


ఇవి కూడా చదవండి...
భర్తను చంపించి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..

నేటినుంచి అందుబాటులోకి మెగా ఆయిల్‌ ప్యాకింగ్‌ స్టేషన్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 05:48 AM