బాలుడిపై ట్రాన్స్‌జెండర్ లైంగిక దాడి
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:59 AM
బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ట్రాన్స్‌జెండర్‌ను కాచిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన కాచిగూడ పోలీసులు
బర్కత్‌పుర, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ట్రాన్స్‌జెండర్‌ను కాచిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఎస్. రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. నింబోలిఅడ్డాలో నివాసం ఉంటున్న జి. అవంతిక భార్గవ్ అలియాస్ శ్రావణ్‌కుమార్ (33) ట్రాన్స్‌జెండర్. ఈ నెల 24న స్థానికంగా ఉండే 14 ఏళ్ల బాలుడిపై ఇంట్లో ఎవరు లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.
జరిగిన విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పగా వారు కాచిగూడ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ట్రాన్స్‌జెండర్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా న్యాయమూర్తి జుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. ఈ మేరకు నిందితుణ్ని జైలుకు తరలించినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మత్తుమందిచ్చి ఉద్యోగినిపై లైంగికదాడి!
తెలంగాణ బయట బీడీఎస్ చదివితే పీజీ డెంటల్‌కు నాన్ లోకల్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News