తెలంగాణ బయట బీడీఎస్ చదివితే పీజీ డెంటల్‌కు నాన్ లోకల్
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:28 AM
తెలంగాణ బయట బీడీఎస్, ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎ్‌స తదితర గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు చదివిన వారు పీజీ మెడికల్ కోర్సులకు స్థానికులుగా పరిగణనలోకి రారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదన
రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ వర్సిటీలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బయట బీడీఎస్, ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎ్‌స తదితర గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు చదివిన వారు పీజీ మెడికల్ కోర్సులకు స్థానికులుగా పరిగణనలోకి రారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ సామాజిక సంక్షేమ స్కాలర్‌షి్‌పతోనే 2019-23 మధ్య ఏపీలోని అమలాపురం కోనసీమ కిమ్స్ డెంటల్ కాలేజీలో బీడీఎస్ కోర్సును పూర్తి చేసిన తనను పీజీ డెంటల్ కోర్సులో చేరడానికి స్థానిక కోటాలో అనర్హుడినని కాళోజీ ఆరోగ్య యూనివర్శిటీ పక్కన బెట్టడం చెల్లదదని వరంగల్ నగరంలోని కాశిబుగ్గ వాసి వి.సాహిత్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ శుక్రవారం చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ.. తెలంగాణలో గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు చదివిన వారే పీజీ మెడికల్ కోర్సుల్లో స్థానిక కోటాకు అర్హులని పేర్కొన్నారు. పిటిషనర్ ఏపీలో డెంటల్ కోర్సు చదవడానికి తెలంగాణ సర్కారు స్కాలర్‌షిప్ ఇచ్చినా.. పీజీ డెంటల్ కోర్సుకు స్థానికత అర్హత కోల్పోయారన్నారు. ఈ విషయమై 2024లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. పిటిషనర్‌ను స్థానికుడిగా అనుమతినిస్తే ‘లోకల్ కేటగిరీ’ ఉద్దేశం పూర్తిగా దెబ్బ తింటుందని వాదించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. గతంలో ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన మాట వాస్తవమైనా.. అందులో యూజీ, పీజీ డెంటల్ కోర్సులు లేవని చెప్పారు. ఇరు పక్షాల వాదనలను విన్న ధర్మాసనం.. పీజీ డెంటల్ కోర్సులక గత తీర్పు వర్తిస్తుందా? అనే అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆయిల్‌పామ్ రైతులకు రక్షణ కల్పించాలి
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో త్వరలో ఓపీ సేవలు !
Read Latest Telangana News And AP News And National News
And Telugu News