Share News

కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్

ABN , Publish Date - Aug 19 , 2026 | 07:13 PM

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండా సుస్మిత వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అగ్రహం వ్యక్తం చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి కొండా సురేఖను వివరణ కోరాలని నిర్ణయించింది.

కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్
TPCC

హైదరాబాద్, ఆగస్టు19: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండా సుస్మిత వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అగ్రహం వ్యక్తం చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి కొండా సురేఖను వివరణ కోరాలని నిర్ణయించింది. మరోవైపు కొండ సుస్మితపై క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆమెపై కఠిన చర్యలకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సిద్ధమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయని ఆ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా ఖండించారు.


పార్టీకి సంబంధించిన లక్ష్మణ రేఖను ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాత ఆమెపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంకో వైపు ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక అందజేయాలని ఇప్పటికే టీపీసీసీ చీఫ్‌ను ఆమె కోరిన విషయం విదితమే.


వరంగల్ జిల్లా గీసుకొండలో బుధవారం మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలను ఆమె అభిమానులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పరకాల నుంచి తాను బరిలో దిగుతానని ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం తనకు టికెట్ ఇవ్వకున్నా.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వెల్లడించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సుస్మిత వ్యాఖ్యలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై పార్టీ సీరియస్ అయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

సముద్రంలో గల్లంతైన 7 మంది మత్స్యకారులు.. ముమ్మరంగా గాలింపు

For More TG News And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 07:19 PM