Share News

నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:42 PM

రంగారెడ్డి జిల్లాలో నైట్రాజెపామ్-10 ఎంజీ టాబ్లెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్
Nitrazepam Drug

హైదరాబాద్, ఆగస్టు19: రంగారెడ్డి జిల్లాలో నైట్రాజెపామ్-10 ఎంజీ టాబ్లెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,840 నైట్రాజెపామ్ టాబ్లెట్లతోపాటు మూడు సెల్ ఫోన్లు, రూ.1000 స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 18వ తేదీన గార్స్ ఆసుపత్రి సమీపంలో మహ్మద్ అష్పాక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 800 నైట్రాజెపామ్ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని విచారించారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులు రామ్‌జానే, మహ్మద్ ఇమ్రాన్‌లను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి కూడా భారీగా ఈ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.


ఈ స్వాధీనం చేసుకున్న టాబ్లెట్ల విలువ రూ.1.23 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఒక్కో టాబ్లెట్ రూ. 20కి కొనుగోలు చేసి.. రూ.50కి నిందితులు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడించారని తెలిపారు. ఈ మత్తుమందు అక్రమ విక్రయాల ద్వారా వీరు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ మందు ప్రధాన సరఫరాదారులుగా రోహన్, కరణ్, నడే అజయ్‌గా గుర్తించామని చెప్పారు. అయితే ప్రధాన సరఫరాదారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వెల్లడించారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్ రాజేంద్రనగర్ జోన్, కామాటిపుర పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: మల్లు రవి

For More TG News And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 07:04 PM