కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌ను కలిసిన మంత్రి తుమ్మల.. చర్చించిన అంశాలివే
ABN , Publish Date - May 21 , 2026 | 02:44 PM
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ఎస్ స్కీంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, మే 21: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈరోజు(గురువారం) రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ ఐఐఎంఆర్‌లో కేంద్ర మంత్రిని కలిసిన తుమ్మల.. మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ఎస్ స్కీంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పీఎంఆర్‌కేవీవై-పీడీఎంసీ(PMRKVY-PDMC), ఎంఐడీహెచ్(MIDH) పథకాల కింద ఉద్యానశాఖకు నిధుల కేటాయింపులు పెంచాలని వినతి చేశారు. ఈ రబీ సీజన్‌కు సంబంధించిన పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3,690 మెట్రిక్ టన్నుల నుంచి 15,262 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రమంత్రిని మంత్రి తుమ్మల కోరారు.
పామాయిల్‌పై ఉన్న దిగుమతి సుంకాన్ని పెంచేలా సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని మంత్రి తుమ్మల కోరాగా.. ఇందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమగ్ర సమీక్ష నిర్వహించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో మే 25 నుంచి ‘మహిళా వారోత్సవాలు’
దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన నేత రాజీవ్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News