మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దులో చిక్కుకున్న ముగ్గురు హైదరాబాదీలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:00 AM
హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు థాయ్‌ల్యాండ్-మయన్మార్ సరిహద్దులో చిక్కుకుపోయారు. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి అక్కడకు రప్పించి తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- విదేశాంగ మంత్రికి సమాచారమిచ్చిన ఒవైసీ
హైదరాబాద్ సిటీ: విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామన్న సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి, హైదరాబాద్(Hyderabad)కు చెందిన ముగ్గురు యువకులు థాయ్‌ల్యాండ్-మయన్మార్ సరిహద్దులో చిక్కుకుపోయారు. యువకుల్లో ఒకరు ఉస్మాన్‌నగర్(Osman Nagar)కు చెందిన వారు కాగా మరో ఇద్దరు మౌలాలీ, బంజారాహిల్స్‌లకు చెందిన వారు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని నమ్మించిన సైబర్ ముఠా.. వీరిని 15 రోజుల క్రితం థాయ్‌లాండ్‌కు రప్పించుకుంది.

అక్కడకు వెళ్లిన తర్వాత ఉద్యోగం ఇవ్వకుండా, మయన్మార్ సరిహద్దుల్లోని నిర్బంధ శిబిరాల్లో ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇదే విషయాన్ని బాధితులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితుల్లో ఓ యువకుని తల్లి రెండు రోజుల క్రితం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(MP Asaduddin Owaisi)ని కలిసి తన కుమారుడిని రక్షించాలని వేడుకుంది. దీనిపై స్పందించిన ఎంపీ.. విషయాన్ని విదేశాంగ మంత్రి జయశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌తో పాటు దక్షిణ భారత దేశం నుంచి మొత్తం 16 మంది ఇలాగే సైబర్ మోసగాళ్లు చేతిలో మోసపోయి అక్కడే చిక్కుకున్నారని, వారందరనీ సురక్షితంగా భారత్‌కు రప్పించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..
జగన్ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత
Read Latest Telangana News and National News