Share News

కార్తిక మాసంలో పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:52 AM

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.

కార్తిక మాసంలో పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
rtc

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. నవంబరు 10 నుంచి డిసెంబరు 8 వరకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. భక్తులు సౌకర్యంగా పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి స్వస్థలాలకు చేరుకునేలా ప్రాంతాల వారీగా ఈ ఏర్పాట్లు చేసింది.


రంగారెడ్డి రీజియన్‌ నుంచి పంచారామాలు, అరుణాచలం, గోల్డెన్‌ టెంపుల్‌, కాణిపాకం, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నల్గొండ ప్రాంతం నుంచి యాదగిరిగుట్టకు., కరీంనగర్‌ ప్రాంతం నుంచి వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి క్షేత్రాలకు., సికింద్రాబాద్‌ రీజియన్‌ నుంచి కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. కార్తిక మాసంలో శివాలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఈ సర్వీసులను నడుపుతున్నారు. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 06:52 AM