హరీశ్ ఆరోపణలు అవాస్తవం
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:06 AM
మహాలక్ష్మి పథకం అమలు, పండుగ ప్రత్యేక బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవని టీజీఎ్‌సఆర్టీసీ స్పష్టం చేసింది.
2003 నుంచే టికెట్ ధరల నియంత్రణ అమలు
విజయవంతంగా ‘మహాలక్ష్మి ఉచిత బస్సు’ పథకం
దసరాకు 7,000 ప్రత్యేక సర్వీసులు: టీజీఎస్ఆర్టీసీ
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకం అమలు, పండుగ ప్రత్యేక బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవని టీజీఎ్‌సఆర్టీసీ స్పష్టం చేసింది. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీకనుగుణంగా టికెట్ ధరల నియంత్రణ నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని పేర్కొంది. పండుగల వేళ ఆర్టీసీ అధికారులు టికెట్ల ధరలు పెంచుతున్నారని, ప్రత్యేక బస్సులు రద్దు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉప నేత టి.హరీశ్‌రావు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2003 నుంచి ఆర్టీసీ టికెట్ ధరల నియంత్రణ నిర్ణయం అమల్లో ఉందని పేర్కొంది. సంస్థపై అదనపు భారం పడకుండా నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించింది.
మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ పథకం అమలులో ఆడబడుచులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అలాగే, దసరా పండుగ వేళ బస్సు సర్వీసులను తగ్గించలేదని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పండుగ వేళ ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఈసారి ప్రత్యేకంగా 7,000 అదనపు బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 10వ తేదీ నుండి ఇప్పటివరకు కేటాయించిన అదనపు బస్సుల్లో 97 శాతం సర్వీసులను విజయవంతంగా నడిపించి ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చామని వెల్లడించింది. సంస్థ ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు చేస్తూ ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారని ఆర్టీసీ వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి
మూడోవంతు విద్యుత్ జెన్కో నుంచే...
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International