డెయిరీ ఉత్పత్తుల కేంద్రాలపై టీజీ సేఫ్ దాడులు..
ABN , Publish Date - Sep 05 , 2026 | 08:43 PM
హైదరాబాద్‌లోని డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై తెలంగాణ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్, సెప్టెంబరు 5: నగరంలోని డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్(తెలంగాణ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఏకకాలంలో 14 తయారీ కేంద్రాల్లో మొత్తం 12 బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఫుడ్ సేఫ్టీ, పోలీసులు, హెచ్ ఫాస్ట్ బృందాలు సంయుక్తంగా చేసిన ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
చాలా డెయిరీ కేంద్రాలలో రసాయనాలతో పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పనీర్ తయారీలో పామాయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్ వంటి రసాయనాలను అధిక మొత్తంలో వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చాలా కేంద్రాల్లో పరిశుభ్రత లోపించినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. రూ.7.19 లక్షల విలువైన ఆహార పదార్థాలు సీజ్ చేసినట్లు వారు పేర్కొన్నారు.
కల్తీకి పాల్పడ్డారన్న అనుమానంతో 21 ఆహారపదార్థాల శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. కల్తీ ఆహారపదార్థాలు ఉత్పత్తి చేస్తున్న మూడు డెయిరీ యూనిట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను రద్దు చేశామని అధికారులు వెల్లడించారు. పలు తయారీ కేంద్రాలు కనీస ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు కేంద్రాలకు నోటీసులు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
బాబర్‌కు వారి గతే పట్టొచ్చు.. మాజీ పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీచర్స్ డే.. ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సచిన్!