విజయవాడ హైవేలో హోటళ్లపై టీజీ సేఫ్ దాడులు
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:34 AM
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లపై దాడులు చేశారు.
ఏడు హోటళ్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతులు రద్దు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లపై దాడులు చేశారు. బుధవారం 10 బృందాలుగా ఏర్పడిన టీజీ సేఫ్ అధికారులు జాతీయ రహదారికి ఇరువైపులా నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల పరిధిలో ఉన్న 20 హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. నకిరేకల్‌లోని సాయిప్రియా ఫ్యామిలీ రెస్టారెంట్‌కు ఎలాంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు, కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు చేస్తున్నట్లు గుర్తించి హోటల్‌ను మూసివేయించారు.
సూర్యాపేటలోని మిడ్వే పాల్జా, వివేరా హోటల్, హోటల్ సాయికృష్ణ, హోటల్ వింటేజ్, శ్రీతిరుమల గ్రాండ్, సంగం హోటల్, దరసుత్ర ఫుడ్స్ నిర్వాహకులకు బెటర్మెంట్ నోటీసుల జారీ చేశారు. కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉన్న హోటళ్లు 7 మిడ్వే ప్లాజా, అమ్మచేతి వంట, తనూజ హోటల్స్, శ్రీ ఆద్య గ్రాండ్, ఏవీఆర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, హైవే హాస్పటాలిటీ, మమత లాడ్జ్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతులు రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
పీజీ మెడికల్ ‘కన్వీనర్’ సీట్లకు నేటి నుంచే దరఖాస్తులు..
ఎఫ్‌ఎంజీల ఇంటర్న్‌షిప్ రద్దు చేద్దాం!
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News And International