Share News

హైకోర్టులో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. సెప్టెంబర్ 16న తీర్పు

ABN , Publish Date - Aug 21 , 2026 | 03:25 PM

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.

హైకోర్టులో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. సెప్టెంబర్ 16న తీర్పు
Telangana High Court

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 16న తీర్పును వెల్లడించనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆయా ఎమ్మెల్యేలు ప్రచారం చేసిన వీడియోలను న్యాయస్థానానికి సమర్పించారు. అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటున్నారని బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలియజేశారు. ఏఐసీసీ అధికారిక కార్యక్రమాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారని, వీరి వీడియోలు ABN ఆంధ్రజ్యోతిలో ప్రసారం అయ్యాయని తెలిపారు.


ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని.. జాతీయ జెండాగా చెబుతున్నారని, జాతీయ జెండాలో అశోక చక్రం ఉంటుందని గండ్ర మోహన్ రావు.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే దానం నాగేందర్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికై, ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూనే కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారని కోర్టుకు వివరించారు. పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్లలో ప్రసారమైన వార్తా కథనాలు, వీడియోలను కూడా బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు న్యాయస్థానం ముందు ఉంచారు. ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో సెప్టెంబర్ 16న తీర్పును వెల్లడించనున్నట్లు హైకోర్టు పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్‌ లిక్కర్ పట్టివేత

బహిష్కరించక ముందే వెళ్లిపోండి.. కొండా సురేఖపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2026 | 04:04 PM